top of page
Search

Maha Shiva Ratri

  • ugandhar74
  • Feb 23, 2016
  • 1 min read

మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం

పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయం లో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి. భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు.

శివప్రదోషస్తోత్రం

కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే

వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్‌

గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః

 
 
 

コメント


Social Gnana

A BLOG BY GNANA DEEP

Social wiz in the media biz 

© 2016 BY SOCIAL GNANA

PROUDLY CREATED WITH WIX.COM

bottom of page